అవీ – ఇవీ : రికార్డ్​ల రష్​

అవీ – ఇవీ : రికార్డ్​ల రష్​

అమెరికాలోని ఐడాహో నివాసి డేవిడ్ రష్. ఇతను చేసిన పని తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతగొప్పగా ఏం చేశాడంటే... మామూలుగా ఒక గిన్నిస్ రికార్డ్ సాధించడానికే చాలా కష్టపడాలి. ఏకాగ్రత, అంకితభావం, పట్టుదల, తపన ఉండాలి. నిత్యం సాధన చేయాలి.. అప్పుడే అనుకున్నది సాధిస్తారు. మరి ఇతనికి ఆ క్వాలిటీస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. 

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 గిన్నిస్ రికార్డులు కొల్లగొట్టాడు. అంతేనా.. ఈ రికార్డ్​లన్నీ ఒక్కరోజే సాధించి చరిత్ర సృష్టించాడు​. దీన్ని మించిన విషయం ఇంకోటి ఉంది.. అదేంటంటే డేవిడ్ తన లైఫ్​లో ఇప్పటివరకు 250కి పైగా ప్రపంచ రికార్డులు బ్రేక్ చేశాడు. అంతేకాదు.. లండన్​లోని గిన్నిస్ వరల్డ్​ రికార్డ్స్ హెడ్ క్వార్టర్స్​కు వెళ్లిన రష్.. ప్రస్తుతం తన దగ్గర ఉన్న180 టైటిల్స్​ని వేలం వేయడానికి రెడీ అయ్యాడు.

రికార్డుల పరంపర

‘ఒకే రోజులో అన్ని రికార్డులు బ్రేక్ చేయడం అనేది డేవిడ్​కు మాత్రమే సాధ్యమైంది’ అని గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ జడ్జి విల్ సిండెన్ అన్నాడు. మొదట మ్యాజిక్ షోలు చేసేవాడట రష్​. ఒక నిమిషంలో మూడు యాపిల్స్​ గాల్లోకి విసిరి ఎక్కువసార్లు కొరికాడు. అలాగే టేబుల్ టెన్నిస్ బాల్​ని రెండు బాటిల్స్​ మూతలపై పెట్టి పదిసార్లు బౌన్స్​ చేశాడు. ఈ ఫీట్ కేవలం 2.09 సెకన్లలో​ సాధించాడు. 30 సెకన్లలో125 భారీ బేస్ బాల్స్​ను చేత్తో చాలాసార్లు తాకిన రికార్డు బ్రేక్ చేశాడు. పింగ్​ పాంగ్​ బాల్స్​ను వాడి రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ లిస్ట్​లో కేవలం 30  సెకన్లలో ఎక్కువసార్లు టేబుల్ టెన్నిస్​ బాల్స్​ను నోటితో గోడకు కొట్టాడు. 

మూడు బంతులతో ఒక నిమిషంలో బౌన్స్ చేసి రికార్డ్​లకి ఎక్కాడు. రెండు బంతులను బ్యాలెన్స్​ బోర్డులో ఒక నిమిషంలో పూర్తి చేశాడు. అంతేకాకుండా 5.12 సెకన్ల పేపర్ ఎయిర్​ క్రాఫ్ట్​ను మడతపెట్టి తక్కువ టైంలో వేగంగా విసిరాడు. ఒక నిమిషంలో 29 కంటే ఎక్కువ చాప్​ స్టిక్​లు విసిరి టైటిల్ గెలిచాడు. 30 సెకన్లలో టీ – షర్టులు ధరించాడు. 10 టాయిలెట్ పేపర్ రోల్స్​ను ఒక చేత్తో పేర్చడం, సెకన్ల టైంలో స్ట్రాతో ఒక లీటరు నిమ్మరసం తాగడం వంటి అనేక రికార్డులు కొల్లగొట్టాడు రష్​. ఈ రికార్డులన్నీ ఒక్కరోజులోనే పూర్తి చేయడం మామూలు విషయం కాదు. జడ్జిలు కూడా నమ్మలేని విధంగా రికార్డులు బద్దలుకొట్టాడు డేవిడ్ రష్​.