ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2025-–26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ (సేల్స్ అండ్ ఆపరేషన్స్) 1000 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థుల ఆన్లైన్లో నవంబర్ 6 నుంచి నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్సైట్లో సంప్రదించాలి.