ఐడీబీఐలో మేనేజర్​ పోస్టులు.. ఏడాదికి రూ. 6 లక్షల ప్యాకేజీ

ఐడీబీఐలో మేనేజర్​ పోస్టులు.. ఏడాదికి రూ. 6 లక్షల ప్యాకేజీ

జూనియర్ అసిస్టెంట్​ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఐడీబీఐ) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 12 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు : జూనియర్ అసిస్టెంట్​మేనేజర్​(గ్రేడ్​ఓ) 650. యూఆర్​260, ఎస్సీ 100, ఎస్టీ 54, ఈడబ్ల్యూఎస్​65, ఓబీసీ 171, పీడబ్ల్యూడీ 26.

ఎలిజిబిలిటీ: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారూ అర్హులే. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 2025, మార్చి 1 నాటికి 20 నుంచి 25 ఏండ్లు ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్​ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250, ఇతర అభ్యర్థులు రూ.1050 చెల్లించాలి. 

లాస్ట్​ డేట్: మార్చి 12.

సెలెక్షన్​ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్​ డిప్లొమా ఇన్​ బ్యాంకింగ్​ అండ్​ఫైనాన్స్​ కోర్సు(పీజీడీబీఎఫ్) పూర్తి చేయాలి.  మణిపాల్​స్కూల్​ ఆఫ్​ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్​ అండ్​ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తి చేయాలి. ఏడాది కోర్సులో ఆరు నెలల క్లాస్​ రూమ్​ ట్రైనింగ్, రెండు నెలలు ఇంటర్న్ షిప్, నాలుగు నెలలు ఆన్​ జాబ్​ ట్రైనింగ్​ ఉంటాయి. 

స్టైపెండ్, శాలరీ: ట్రైనింగ్​ సమయంలో నెలకు రూ.5000, ఇంటర్న్​షిప్​ సమయంలో నెలకు రూ.15,000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య అందుతుంది.