40 శాతం పెరిగిన ఐడీబీఐ బ్యాంక్ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ. 1,719  కోట్ల నికర లాభం సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 40 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 6 శాతం గ్రోత్‌‌‌‌‌‌‌‌ను నమోదు చేసింది.

బ్యాంక్ గ్రాస్ నాన్‌‌‌‌‌‌‌‌ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌‌‌‌‌‌‌‌పీఏ) రేషియో కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 1.18 శాతం తగ్గి ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.87 శాతంగా రికార్డయ్యింది. నెట్ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల రేషియో 0‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.21 శాతం తగ్గి 0.23 శాతానికి మెరుగుపడింది. బ్యాంకుకు క్యూ1 లో   రూ.3,233 కోట్ల  నికర వడ్డీ ఆదాయం  వచ్చింది.