
నిరుద్యోగులకు శుభవార్త అందుతోంది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 12 చివరి తేదీ. అర్హత, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 650
- పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
విద్యార్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని స్ట్రీమ్‌లో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
- ప్రాంతీయ భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు.
దరఖాస్తు ఫీజు: SC/ST/PwBD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. కాకపోతే ఇంటిమైజేషన్ ఫీజు రూపంలో రూ.250 వసూలు చేస్తున్నారు. ఇతర అభ్యర్థులు దరఖాస్తు రుసుము, ఇంటిమైజేషన్ ఫీజు కలిపి రూ. 1050 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ:
- వ్రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. వ్రాత పరీక్ష.. ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ పరీక్ష. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి పెనాల్టీ కూడా ఉంటుంది. తప్పు సమాధానానికి ప్రశ్నకు కేటాయించిన మార్కులలో నాలుగో వంతు మార్కులు తీసివేయడం జరుగుతుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్.. తదుపరి 2 నెలలు ఇంటర్న్‌షిప్ కాలంగా ఉంటుంది. శిక్షణ కాలంలో రూ.5వేలు, ఇంటర్న్‌షిప్ కాలంలో రూ .15వేలు నెలవారీ స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారు బ్యాంకు ఉద్యోగిగా పరిగణించబడతారు. అప్పుడు పెద్ద జీతాలు చేతికి అందుతాయి.
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 01, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2025