ఐడీబీఐలో 1036 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు

ఐడీబీఐలో 1036 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు


ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.  జీతం నెలకు రూ.29,000 నుంచి రూ.34,000 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్​లైన్​లో జూన్​ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ ఎగ్జామ్​ జులై 2న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్​సైట్​లో చూడాలి.