
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. మొత్తం 226 ఖాళీల్లో గ్రేడ్ బి మేనేజర్లు–82, గ్రేడ్ సి - అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు 111, గ్రేడ్ డి - డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు 82 ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: జూన్ 25 నుంచి జులై 10వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం వెబ్సైట్ www.idbibank.in సంప్రదించాలి.