ఐడీబీఐ బ్యాంక్​లో 600 అసిస్టెంట్‌‌ మేనేజర్స్ జాబ్స్

ఐడీబీఐ బ్యాంక్​లో 600 అసిస్టెంట్‌‌ మేనేజర్స్ జాబ్స్

ఐడీబీఐ 600 అసిస్టెంట్ మేనేజ‌‌ర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేష‌‌న్ రిలీజ్​ చేసింది. ఎంపికైన‌‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది (6 నెలలు త‌‌ర‌‌గ‌‌తి పాఠాలు, 2 నెలలు ఇంట‌‌ర్న్‌‌షిప్‌‌, 4 నెలలు ఆన్‌‌ జాబ్‌‌ ట్రైనింగ్‌‌) పాటు పీజీడీబీఎఫ్‌‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌‌తోపాటు జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ మేనేజర్ (గ్రేడ్‌‌-ఓ) ఉద్యోగం ల‌‌భిస్తుంది. 

ALSO READ: ఆర్​బీఐలో అసిస్టెంట్ జాబ్స్​

అర్హత‌‌: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాల‌‌యం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. వ‌‌య‌‌సు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థుల‌‌కు ఆన్‌‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రతిభ క‌‌న‌‌బ‌‌ర్చిన వారు ప‌‌ర్సన‌‌ల్ ఇంట‌‌ర్వ్యూల‌‌కు అర్హత సాధిస్తారు.

ట్రైనింగ్​, ఫీజు: ఎంపికైన అభ్యర్థుల‌‌ను ఏడాదిపాటు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌‌) కోర్సులో చేరుస్తారు. ఆ స‌‌మ‌‌యంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. కోర్సులో చేరేట‌‌ప్పుడు అభ్యర్థులు మూడేళ్లు స‌‌ర్వీస్ బాండ్ స‌‌మ‌‌ర్పించాల్సి ఉంటుంది. 
ద‌‌ర‌‌ఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌‌లైన్ ద్వారా సెప్టెంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​ ఎగ్జామ్​ అక్టోబర్ 20న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.