IDBIలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

IDBIలో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..!

IDBI బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లామా మొదటి సంవత్సరం పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కు సంబంధించిన అదనపు సమాచారం, వివరాలు తెలుసుకునేందుకు www.idbibank.in లో చూడగలరు. 

పోస్టులు: జూనియర్ అస్టిస్టెంట్ మేనేజర్ (JAM)

మొత్తం ఖాళీలు: 500 

నోటిఫికేషన్ తేది: 2024 ఫిబ్రవరి 7

దరఖాస్తుల స్వీకరణ తేది: 12ఫిబ్రవరి - 26 ఫిబ్రవరి 2024 వరకు 

ఆన్ లైన్ పరీక్ష తేది : 17 మార్చి, 2024

www.idbibank.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

విదార్హతలు: 

  • అభ్యర్థులు ఏదేనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. 
  • కంప్యూటర్ పరిజ్ణానం ఉండాలి 
  • ప్రాంతీయ భాష పరిజ్ణానం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. 

వయో పరిమితి : 

జనవరి 31, 2024 నాటికి  20 సంవత్సరాలు నిండి ఉండాలి. 25 సంవత్సరాల లోపు ఉండాలి.