ప్రభుత్వ రంగ సంస్థ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) 1,000 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు ఎప్పటివరకు గడువు ఉంది..? ఎలా దరఖాస్తు చేయాలి..? జీతభత్యాలు ఎలా ఉంటాయి..? వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు: 1,000
రిజర్వేషన్ల వారీగా ఖాళీలు:
- జనరల్: 448
- ఎస్‌సీ: 127
- ఎస్‍టీ: 94
- ఓబీసీ: 231
- ఈడబ్ల్యూఎస్: 100
అర్హతలు: ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై వారు అర్హులు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 01/ 10/ 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1050.. ఎస్‌సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: మొదటి ఏడాదిలో నెలకు రూ.29,000, రెండో ఏడాదిలో నెలకు రూ.31,000 వేతనం చెల్లిస్తారు. రెండేళ్ల కాంట్రాక్ట్ సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM)గా నియమించబడతారు. అప్పుడు ఏడాదికి రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల మధ్య వేతనం అందుతుంది.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 07/ 11/ 2024
- దరఖాస్తులకు చివరితేది: 16/ 11/ 2024
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01/ 12/ 2024
మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవగలరు. నోటిఫికేషన్ కోసం IDBI Recruitment 2024 Notification లింక్‌పై క్లిక్ చేయండి.