వరంగల్‌లో తొమ్మిదో మృతదేహం గుర్తింపు

వరంగల్ రూరల్ జిల్లాలో అనుమానాస్పద  స్థితిలో చనిపోయిన వారి సంఖ్య 9కి చేరింది. గీసుకొండ మండలం  గొర్రెకుంటలో… బావిలో ఒకే కుటుంబానికి  చెందిన నలుగురి  శవాలు  గురువారం కనిపించాయి.  వీరంతా  బెంగాల్ నుంచి  వచ్చి  ఇక్కడి  ఓ కంపెనీలో పనిచేస్తున్న.. మక్సూద్,  అతని  భార్య నిశా , కూతురు  బుశ్రా, ఆమె  మూడేళ్ల చిన్నారిగా  పోలీసులు గుర్తించారు. కాగా ఇవాళ  అదే బావిలో మరో 5  మృతదేహాలు  బయటపడటం  కలకలం సృష్టిస్తోంది.

కొంతకాలం క్రితం మసూద్  కుటుంబం బతుకు దెరువు  కోసం బెంగాల్ నుంచి వచ్చి.. గొర్రెకుంట  గ్రామంలో  నివాసం ఉంటోంది. స్థానికంగా ఉన్న కంపెనీలో మక్సూద్, అతని భార్య  పని చేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు పాలిటెక్నిక్  చదువుతున్నారు. కూతురికి పెళ్లై.. మూడేళ్ల బాబు  ఉన్నాడని  స్థానికులు చెబుతున్నారు. గురువారం వీళ్లు కనిపించకపోవటంతో కంపెనీ ఓనర్ చుట్టుపక్కల  వెతకి.. బావిలో మృతదేహాలు  చూసి  పోలీసులకు సమాచారం  అందించాడు. ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు నలుగురి  మృతదేహాలను వెలికి తీశారు.

మృతదేహాల ఒంటిపై గాయాలు లేకపోవటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి క్యూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే.. హత్యా, ఆత్మహత్యా అనేది నిర్ధారణ అవుతుందన్నారు సీపీ.

వరంగల్ ఘటనలో మొత్తం మృతి చెందిన 9 మంది వివరాలు
1)మాసూద్ అలం (50)
2)నిషా అలం భార్య (45)
3)బూస్రా అలం (22) కూతురు
4)3సంవత్సరల బాబు
5)శబాజ్ అలం (21) కొడుకు
6)సోహిల్ అలం (20) కొడుకు
7) షకీల్ (40) డ్రైవర్
8) శ్రీరామ్ (35) తోటి కార్మికుడు
9) శ్యామ్ (40) తోటి కార్మికు డు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి