
హైదరాబాద్, వెలుగు: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్‌లకు జీఎస్టీ చెల్లింపులను సులభతరం చేయడానికి జీఎస్టీ పోర్టల్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా సేవలను అందిస్తుంది. బ్యాంక్ తన కస్టమర్‌లకు జీఎస్టీ రిటర్న్‌లను ఫైల్ చేయడంలో సహాయం చేస్తామని ప్రకటించింది. దీనివల్ల కస్టమర్లు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు కట్టవచ్చని, వెంటనే చలాన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. బ్యాంకు రిటైల్, కార్పొరేట్ఇంటర్నెట్బ్యాంకింగ్, బ్రాంచుల ద్వారా జీఎస్టీ చెల్లించవచ్చు.