ఐడీఎఫ్‌‌‌‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో ఏస్​ ఫీచర్

ఐడీఎఫ్‌‌‌‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో ఏస్​ ఫీచర్

హైదరాబాద్​, వెలుగు: ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌‌‌‌లో అడ్వాన్స్​డ్​ క్యూరేటెడ్​ఎక్స్​పీరియన్స్​(ఏస్​) అనే కొత్త ఫీచర్‌‌‌‌ను ప్రారంభించింది. మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లో  పెట్టుబడులు పెట్టడంలో పెట్టుబడిదారులకు ఇది సహాయపడుతుంది. దీంతో కస్టమర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా, వారి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా తగిన ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆప్షన్‌‌‌‌లను పొందవచ్చు. ఈ ఫీచర్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఈజీగా మార్చడంతోపాటు, వినియోగదారులు సమర్థంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. 500 పైగా మ్యూచువల్ ఫండ్ల సమాచారం తెలుసుకోవచ్చు. వివిధ రకాల ఈక్విటీ, డెట్, టాక్స్-సేవింగ్, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్ల గురించి వివరాలు పొందవచ్చు.