బ్యాంకు ఖాతాలు తెరవడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండా వీడియో ద్వారా తమ కెవైసీని సమర్పించే అవకాశాన్ని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే.. తనకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాలి. అంతేకాకుండా.. బయోమెట్రిక్ కూడా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం కరోనా వల్ల చాలామంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. దాంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ‘ఈ విధానం వల్ల వినియోగదారులు బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా పొదుపు ఖాతాలను తెరవగలరు. ఖాతా తెరవడానికి బ్యాంకు సిబ్బంది ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు’ అని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్ హెడ్ అమిత్ కుమార్ అన్నారు. ఈ పద్దతిలో ఖాతా తెరచిన వినియోగదారులు 7 శాతం వడ్డీని కూడా పొందవచ్చు.
ఆన్‌లైన్ పొదుపు ఖాతా తెరవడానికి ఆర్‌బిఐ మంజూరు చేసిన వీడియో ఆధారిత కెవైసి ప్రక్రియ వినియోగదారులకు ఖాతాలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరంలేదని బ్యాంకు తెలిపింది. లావాదేవీలు జరపడానికి వినియోగదారులు డిజిటల్ మరియు మొబైల్స్ పై ఎక్కువగా ఆధారపడటం వలన ఐడిఎఫ్‌సి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
For More News..