
న్యూఢిల్లీ: వార్‌బర్గ్ పింకస్, ఎడీఐఏ నుంచి ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా మొత్తం రూ. 7,500 కోట్ల నిధుల సేకరణను బోర్డు ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. గురువారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు, గ్లోబల్ గ్రోత్ ఇన్వెస్టర్ వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ కర్రెంట్ సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సుమారు రూ.4,876 కోట్ల విలువైన ఈక్విటీ క్యాపిటల్ ప్రిఫరెన్షియల్ ఇష్యూను ఆమోదించింది.
అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఏఐ) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ప్లాటినం ఇన్విక్టస్ బీ 2025 ఆర్ఎస్సీ లిమిటెడ్‌కు రూ.2,624 కోట్ల విలువైన ఈక్విటీ క్యాపిటల్‌ను జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. దీనిని ప్రైవేట్ ఈక్విటీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా నిర్వహిస్తారు.