
ముంబై : ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయడం ద్వారా రూ. 3,200 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదిత మూలధన సమీకరణతో బ్యాంక్ మొత్తం మూలధన సమృద్ధి 17.49 శాతంకి పెరుగుతుంది. నిధుల సమీకరణ ప్రతిపాదనకు బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం గ్రీన్సిగ్నల్ఇచ్చింది. ఇందుకోసం రూ.పది ముఖ విలువ కలిగిన 39,68,74,600 షేర్లను జారీ చేస్తారు. షేర్ల జారీ, కేటాయింపు కోసం బ్యాంక్ వాటాదారుల ఆమోదం కోసం పోస్టల్ బ్యాలెట్‌ను నిర్వహిస్తారు.