ఇడ్లీని.. ఆలూ వడలా మార్చేశారు.. మైండ్ బ్లోయింగ్ ఫుడ్ ఐటమ్

భోజన ప్రియులారా..మీరు ఇడ్లీ, వడ తిన్నారు. మీకు ఇష్టమైన వ్యక్తులకు ఇడ్లీ, వడ తినిపించి ఉంటారు. కానీ ఇడ్లీతో చేసిన వడను ఎప్పుడైనా తిన్నారా..లేదా తినిపించారా..? ఏంటీ ఇడ్లీతో వడనా..! అదెలా తయారు చేస్తారు..అసలు ఇడ్లీతో వడ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును నేను చెప్పేది నిజం..

ఇడ్లీ అనేది కంప్లీట్గా ఆరోగ్యకరమైన టిఫిన్, వడ అనేది కూడా ఆరోగ్యమే కానీ..దీన్ని నూనేలో వేయించడంతో ఆయిల్ ఫుడ్గా మారుతుంది. కానీ ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు మాత్రం ఇడ్లీతో వడ తయారు చేస్తున్నాడు. ఆలూ వడ స్టైల్లో ఇడ్లీ వడ తయారు చేస్తూ..టిఫిన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఇడ్లీ వడ వీడియో వైరల్ అయింది. 

ఇడ్లీ వడ తయారీ ఇలా..

ఇడ్లీ వడ తయారీలో ముందుగా టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు రెండు ఇడ్లీలను తీసుకుని..వాటి మధ్య ఆలూ కుర్మాను పెట్టాడు. దీన్ని శనగపిండిలో ముంచి..మిర్చి బజ్జీలు వేసినట్లు అయిల్లో  డీప్ ఫ్రై చేశాడు.  దీన్ని ఓ ప్లేట్లో తీసుకుని వాటిపై సాంబార్, కొబ్బరి చట్నీ పోసి..కస్టమర్లకు వడ్డించాడు. ఈ ప్రత్యేక వంటకాన్ని కస్టమర్లు లొట్టలేసుకుంటూ తినడం గమనార్హం. 

అయితే ఈ రకమైన ఇడ్లీ వడను కొందరు వ్యతిరిస్తున్నారు. ఇడ్లీని చెడగొట్టారంటూ మండిపడుతున్నారు. కొందరైతే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆనారోగ్యకరమైన ఆహారంగా మార్చారని కామెంట్ చేశాడు. ఇంకో వ్యక్తి అయితే..వడ ఆత్మహత్య చేసుకుందా అని అడిగాడు.