ఘనంగా పెద్దమ్మ, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ఘనంగా పెద్దమ్మ, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఆలయాల్లో పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలన గురువారం ఘనంగా నిర్వహించారు. అర్చక బృందం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అమ్మవార్లను దర్శించుకున్నారు. శివాలయ పునర్నిర్మాణ  కర్త మారగాని శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.