గంగమ్మను చేరిన గణపయ్య

గంగమ్మను చేరిన గణపయ్య

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్  జిల్లావ్యాప్తంగా నవరాత్రులు పూజలందుకున్న గణేశ్​ విగ్రహాలను సోమవారం రాత్రి  ఊరేగింపుగా తీసుకెళ్లి  నిమజ్జనం చేశారు. డీజే సౌండ్స్, డప్పు చప్పుళ్లు, కోలాటాలు, కలర్ ఫుల్  లైట్లు, యువత డ్యాన్సులతో శోభాయాత్ర కనువిందు చేశాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2,931, జగిత్యాల జిల్లాలో 2,791, పెద్దపల్లి జిల్లాలో 2,405, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,198 విగ్రహాలు కలిపి సుమారు 10,325 విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని విగ్రహాలను మానకొండూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొత్తపల్లి చెరువుల్లో, చింతకుంట సమీపంలోని ఎస్సారెస్సీ కాల్వలో నిమజ్జనం చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద ఆఫీసర్లు క్రేన్లు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్  సిటీలోని టవర్ సర్కిల్  వద్ద ఉన్న నంబర్–1 గణేశ్​ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. శోభాయాత్రలో కోలాటం, ఒగ్గుడోలు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కలెక్టర్  పమేలా సత్పతి, మున్సిపల్  కమిషనర్  చాహత్  బాజ్ పాయ్, అడిషనల్  కలెక్టర్లు ప్రఫుల్  దేశాయి, లక్ష్మీకిరణ్  హాజరై పూజలు చేశారు. కరీంనగర్ సీపీ అభిషేక్  మహంతి నేతృత్వంలో పోలీస్​ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జన కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వివిధ ప్రాంతాల్లో 800 మంది పోలీసులను మోహరించారు.