క్లీన్ ఎనర్జీ కోసం రూ.166 లక్షల కోట్ల పెట్టుబడులు : ఐఈఏ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌

క్లీన్ ఎనర్జీ కోసం  రూ.166 లక్షల కోట్ల పెట్టుబడులు : ఐఈఏ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌
  • 80 శాతం చైనా, ఈయూ, యూఎస్‌‌‌‌‌‌‌‌లోనే 

న్యూఢిల్లీ: క్లీన్ ఎనర్జీ (రెన్యువబుల్ కరెంట్‌‌‌‌‌‌‌‌ – సోలార్, విండ్‌‌‌‌‌‌‌‌, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌ వంటివి)  ఉత్పత్తిని, వాడకాన్ని పెంచేందుకు గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా వివిధ దేశాల ప్రభుత్వాలు సుమారు  2 లక్షల కోట్ల డాలర్ల (రూ.166 లక్షల కోట్ల) ను  డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఇన్వెస్ట్ చేశాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) రిపోర్ట్ పేర్కొంది. 2020 నుంచి  క్లీన్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఈ రిపోర్ట్ మొదటి ఎడిషన్  ‘స్టేట్ ఆఫ్ ఎనర్జీ పాలసీ–2024’ ను ఐఈఏ  విడుదల చేసింది. క్లీన్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన పెట్టుబడుల్లో 80 శాతం చైనా, యూరోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌ (ఈయూ), యూఎస్ ప్రభుత్వాలు చేశాయని  వివరించింది. 

రెన్యువబుల్ ఎనర్జీపై ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయి. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి రాయితీలు అందిస్తున్నాయి. పాలసీ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ను ఇస్తున్నాయి.  క్లీన్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోకల్‌‌‌‌‌‌‌‌గా తయారీని పెంచేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని ఐఈఏ రిపోర్ట్ పేర్కొంది.