సరదాగా ‘ఫేక్ ఇగ్లూ’ యాడ్ ఇస్తే.. దిమ్మతిరిగింది

కొన్ని కొన్ని సార్లు చిన్న జోక్ చేసినా దానికి వచ్చే రెస్పాన్స్​ మామూలుగా ఉండదు!! అప్పటి పరిస్థితులను బట్టి జనం స్పందన ఊహకందని రేంజ్‌లో వస్తుంటుంది. అలాంటి ఓ ఘటనే లండన్‌లో జరిగింది. ఏదో సరదాగా జోక్ చేద్దామని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆన్‌లైన్‌లో పెట్టిన యాడ్‌ను చూసి జనాలు ఆ ప్రాపర్టీ మాకు కావాలంటే, మాకు కావాలని భారీ సంఖ్యలో రిక్వెస్టులు పెట్టారు.  ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ను కొన్ని గంటల్లోనే డిలీట్ చేయాల్సి వచ్చింది. అసలు ఆ యాడ్, దాని కథ, ముందూ వెనుక ఏంటంటే.. ప్రస్తుతం బ్రిటన్‌లో గడ్డకట్టించేంత చలి ఉంటోంది. రోజూ టెంపరేచర్స్ భారీగా పడిపోతున్నాయి. గడిచిన 60 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా లండన్‌లోని థేమ్స్‌ నది గడ్డకట్టుకుపోయింది. చలికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. ఈ టైమ్‌లో పాల్మర్ & పార్ట్​నర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ రెండున్నర లక్షల యూరోలకే ఇగ్లూ (మంచు ఖండాల్లో వెచ్చగా ఉండేందుకు కట్టుకునే ఇండ్లు) అమ్ముతామని ఆన్‌లైన్‌లో యాడ్ ఇచ్చింది. లండన్‌లోని నార్త్‌ పోల్ రోడ్‌లో ఒకే ఒక్క ఇగ్లూ ఉందని, కావాలనుకున్న వాళ్లు త్వరపడాలని ప్రకటించింది. ‘మంచి లొకేషన్‌లో ఒక బెడ్ రూమ్, ఒక బాత్‌ రూమ్‌తో ఇగ్లూ ఉంది. పెద్ద ప్లాట్ ఇది. నార్త్ పోల్ రోడ్ ఏరియాలోని ఒక ఫ్యామిలీకి చెందిన దీనిని అమ్మేయాలని అనుకుంటున్నారు. ఆలసించిన ఆశాభంగం. త్వరపడండి. కొనాలనుకునే వాళ్లు అగ్రిమెంట్ చేసుకునే ముందు వచ్చి చూడొచ్చు’ అని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో రాసింది. అంతే కొన్ని గంటల్లోనే వేలాదిగా రిక్వెస్టులు వచ్చేశాయి. ఆ ప్రాపర్టీ మాకు చూపించండంటే, మాకు చూపించండని మెసేజ్‌లు రావడంతో ఆ కంపెనీ షాక్ అయింది. వాస్తవానికి యూకేలోని క్లాక్‌టన్ ఆన్ సీ టౌన్‌లో సెట్ ​వేసి ఫొటో తీశారు. సరదాగా యాడ్ పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దామనుకున్నామని, ఎవరో కొద్ది మంది మాత్రమే దాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకున్నామని ఆ కంపెనీ చెప్పింది. గంట గంటకూ వేల సంఖ్యలో రిక్వెస్టులు రావడంతో ఫిబ్రవరి 13న పెట్టిన ఆ యాడ్‌ను అదే రోజు డిలీట్ చేసింది.

For More News..

ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. ఢిల్లీలో నీళ్లకు కరువు

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది