మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజనులు ఓటు వెయ్యకుంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్ కూడా రాదని చెప్పారు. మునుగోడులో జరుగుతున్నది పార్టీల పోరాటం కాదని.. శ్రమజీవులకు, సంపద దోచుకుంటున్న వారి మధ్యనే పోటీ జరుగుతుందన్నారు. ఆ శ్రమజీవులు బీఎస్పీ వైపు ఉన్నారని తెలిపారు. మునుగోడులో మంత్రులు స్వయంగా మద్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. డబ్బులను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బహుజన రాజ్యం రావాలంటే కష్ట పడాలని.. అందుకోసమే తమ నాయకులు సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ నెల 29 న బీఎస్పీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని...తెలంగాణలో ఉన్న బహుజనులందరిని భాగస్వామ్యం చేస్తామన్నారు. మునుగోడులో కోటి రూపాయలతో కట్టిన ఎమ్మెల్యే కాంప్ ఆఫీసు.. మందు పార్టీలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. 100 కు 90 మంది బహుజనులు బీఎస్పీ వెంటనే ఉన్నారని.. ఆ 90 మందికి ప్రతినిధిగా తమ అభ్యర్థి ఆందోజు శంకరాచారి ఉన్నారని చెప్పారు. వారందరి గొంతుకై ఇక్కడి సమస్యలపై కొట్లాడుతాడరని చెప్పారు.