
చేవెళ్ల, వెలుగు: బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి, నవాబ్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలువైన ఓటుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ రెండు సార్లు ప్రజలను మోసం చేశాడని, మూడో సారి మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతామని చెప్పారు. ప్రధాని మోదీ సుపరిపాలనకు, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. తెలంగాణలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో అమాయక యువత బలైపోయిందని మండిపడ్డారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.