ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తుండు : రాహుల్ గాంధీ

లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.  ఎటువంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా బీజేపీ 400 సీట్లు దాటడం అసాధ్యమన్నారు.  400 సీట్లు దాటేందుకు మోదీ ఇప్పటికే అంపైర్లను నియమించారని గాంధీ ఆరోపించారు. 

ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యమని రాహుల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ లోక్‌తంత్ర  బచావో ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు.   ఎన్నికల కారణంగానే  కాంగ్రెస్ పార్టీ  బ్యాంకు  ఖాతాలు ఫ్రీజ్ చేశారని ఆరోపించారు.  

ALSO READ | కేజ్రీవాల్ సింహం.. జైల్లో బంధించ‌లేరు: సునీత

నేతల అరెస్టుతో ఎన్నికల్లో గెలవాలని మోదీ చూస్తున్నారని..  మోదీ తన ధనిక మిత్రులతో కలిసి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాహుల్ అన్నారు.    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అన్యాయంగా అరెస్టు  చేసిందని మండిపడ్డారు. విపక్షాల గొంతులను అణిచివేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందన్నారు.