నారాయణపేట, వెలుగు: ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే అధికారులు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వొద్దని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్దేవేంద్రప్ప సూచించారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతం స్వీకరించినా కూడా ఎస్సీలుగానే చలామణి అవుతుండడంతో హిందువుల్లోని ఎస్సీలకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఉద్యోగాల్లో వారు హిందువులుగానే పేర్కొంటున్నారని, భారత రాజ్యాంగం ప్రకారం బీసీ–సీ సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ వెంకటేశ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు పోకల లక్ష్మణ్, కోస్గి మండల అధ్యక్షుడు చెన్నప్ప, కనకప్ప మొగులయ్య పాల్గొన్నారు.