తల్లినే చూసుకోని సిద్దూ ప్రజలను పట్టించుకుంటాడా?

తల్లినే చూసుకోని సిద్దూ ప్రజలను పట్టించుకుంటాడా?

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్  సిద్ధూపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ పాకిస్థాన్ చుట్టూ తిరుగుతుండడం సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే పంజాబ్ లోక్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరిందర్ సింగ్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ సిద్దూను కేబినెట్‌లోకి తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నుంచి సిఫార్సు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా శిరోమణి అకాలీదళ్‌ పార్టీ నేత బిక్రమ్ సింగ్ మజీఠియా తన నామినేషన్ సందర్భంగా సిద్దూపై ఆరోపణలు గుప్పించారు. ఆయన సీఎం కాకుంటే పాకిస్థాన్‌ వెళ్లేందుకు కూడా సిద్ధపడతాడని అన్నారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచే సిద్ధూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపైనే ప్రస్తుత ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ నుంచి బిక్రమ్ సింగ్ మజీఠియా పోటీ చేస్తున్నారు. ఇవాళ బిక్రమ్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దూను ఓడించి ఆయన అహంకారాన్ని దించుతామన్నారు. ఇన్నేండ్లుగా అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గంలో సిద్దూ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. సిద్దూ సీఎం సీటు కోసం ఆశగా చూస్తున్నారని, ఆయనను సీఎం చన్నీ ఆ పదవిలో కూర్చోబెట్టకుంటే పాకిస్థాన్‌ వెళ్లేందుకూ వెనుకాబోడని చెప్పారు. ఇక్కడ సీఎం కాకపోతే పాకిస్థాన్‌ వెళ్లి అక్కడ పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు చీఫ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు సిద్దూ సిద్ధపడుతారని బిక్రమ్ సింగ్ మజీఠియా అన్నారు. ఆయన తీరును ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, తన తల్లినే పట్టించుకోని సిద్దూ ప్రజలనేం పట్టించుకుంటారని నిలదీశారు.

మరిన్ని వార్తల కోసం..

ముస్లిం ఓట్లు.. ఎంఐఎంకు మళ్లించడమే బీజేపీ టార్గెట్

సిద్దూ క్రూరమైన వ్యక్తి.. ఆస్తి కోసం అమ్మను గెంటేశాడు

ఉరివేసుకుని మాజీ సీఎం మనవరాలు సౌందర్య ఆత్మహత్య