Friendship Day 2024: ‘‘గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి..ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది’’..బాలమిత్రులకథ సినిమాలోని ఈ ఫేమస్ పాట వినని వారుం డరు..ఇష్టపడని వారుండరు..దశాబ్దాలు గడుస్తున్నా ఈ పాటకు ఆదరణ తగ్గలేదు..స్నేహానికి ఉన్న గొప్ప విలువను అంతలా చాటి చెప్పిందీ పాట..ఇద్దరు బాలమిత్రులు స్కూల్లో పాడిన పాట..వారి మధ్య స్నేహాన్ని అంత అద్భుతంగా వివరించిన పాట. ఈ పాట గురించి ఇప్పుడెందుకు అంటే..ఇవాళ ఆగస్టు 4 అంతర్జాతీయ మిత్రుల దినోత్సవం..ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది..
స్నేహం అంటేనే కన్నప్రేమ,తోబుట్టువుల మద్య ప్రేమకు సమానం..అంతకంటే ఎక్కువ అని భావించేది. అందులో బాల్య స్నేహం గురించి చెప్పనక్కర్లేదు. బాల్యస్నేహం గొప్పతనం గురించి కథలు, సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే బాల్య స్నేహం కొనసాగింపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు..అవేంటో స్నేహితుల దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..
ఫ్రెండ్స్ అనగానే వెంటనే మనకి గుర్తుకు వచ్చేది స్కూల్ ఫ్రెండ్స్..స్కూల్ స్నేహాలు ఎన్నిటికీ విడిపోని బంధాలుగా ఉంటాయి. అందులో బాల్యస్నేహాలు ఇంకా విలువైనవి. బాల్యస్నేహాలు కొనసాగించడం వల్ల అనేక మానసిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
- ALSO READ | తెలంగాణ కిచెన్ : కాకరకాయతో వెరైటీలు
బాల్య స్నేహితులు ఓ ఎమోషనల్ యాంకర్స్.. చిన్ననాటి స్నేహితులు మన భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకుంటారు.. వారితో దీర్ఘకాలిక స్నేహం కొనసాగిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన ఉన్న సమయంలో మనకు ఎంతో ఊరటనిస్తుంది.
చిన్ననాటి స్నేహాలు ఎక్కువకాలం కొనసాగించడం వల్ల ఒకరి వ్యక్తిత్వం గురించి మరొకరికి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. వారి ఆలోచన విధానం, ఉద్దేశం, లక్ష్యం వంటి వాటిపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. చిన్న నాటి స్నేహాలు కొనసాగించినప్పుడు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
ఒత్తిడిని తగ్గించుకోవచ్చు
బాల్య స్నేహాలు, స్నేహితులతో గడిపిన క్షణాలు ఒత్తిడిని తగ్గించగలవు. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారితో మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ సమస్యల గురించి వారితో చర్చిం చి మీపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
చిన్ననాటి స్నేహాలు సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల వారివారి భావోద్వేగాలకు మద్దతు లభిస్తుంది. మీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మద్దతు నిచ్చే మిత్రులు ఉన్నారంటే మీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఈ పరిస్థితి మీ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది.
నోస్టాల్జియా
చిన్ననాటి స్నేహితులతో తరుచూ మాట్లాడుతుంటే గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటుంటే.. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ స్థితిని నోస్టాల్జియా అంటారు.
స్కిల్స్ పెరుగుతాయి. .
ఎక్కువ కాలం స్నేహాల వల్ల సామాజికంగా స్కిల్ డెవలప్ మెంట్ కు తోడ్పడతాయి. ఈ బంధాలు వ్యక్తుల మధ్య నైపుణ్యాలను పెంపొందించడానికి బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.
కాబట్టి మీ చిన్ననాటి ఫ్రెండ్స్ ను కలవండి.. స్నేహబంధాలను కొనసాగించండి.. ఆరోగ్యంగా ఉండండి. ఆల్ ది బెస్ట్.. ‘‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే’’