ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. సెంటిమెంట్ వాడుకోవడం అనేది చేతకాని తనమని, రాజకీయంగా దివాలాకోరుతనం అని ఆయన మండిపడ్డారు. సెంటిమెంట్ రగల్చడం కోసం వైసీపీ నేత వైవీ సుబ్బా రెడ్డి విఫలయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ అన్నారు.
ఏపీలో మూడు రాజధానుల రాజకీయ ముఖ చిత్రం ఫెయిల్ అయ్యిందన్న అద్దంకి దయాకర్.. కృష్ణా బోర్డు, రాజధాని కొనసాగింపు అంశాలతో వైసీపీ ఎన్నికలకు వెళ్లే ఆలోచనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.