నల్గొండలో బీజేపీని గెలిపిస్తే : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 

  •  ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు

 నల్గొండ అర్బన్​వెలుగు: నల్గొండలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సోమవారం శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ వేసిన తర్వాత వివేకానంద విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొన్న కిరణ్​రిజిజు మాట్లాడుతూ సైదిరెడ్డిని గెలిపిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ నెలకొల్పడంతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చేస్తామన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని 17 సీట్లను బీజేపీ కైవసం చేసుకోబోతుందని, హైదరాబాద్ కూడా ఈసారి బీజేపీ ఖాతాలో పడబోతోందన్నారు. జిల్లాలో కేవలం నాలు గు కుటుంబాలు మాత్రమే రాజ్యమేలుతున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బండారు ప్రసాద్, గోరి మధుసూదన్ రెడ్డి ఉన్నారు.