- ఆరు గ్యారెంటీల డైవర్షన్ కే హైడ్రా ప్లాన్
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొట్టుకోవడమే ప్రజాపాలన!
- ప్రజాపాలన దినోత్సవం కాదు విమోచన దినోత్సవం చేయాలి
హైదరాబాద్: ఎన్నికల కమిషన్ బీజేపీ కంట్రోల్ లో ఉంటే 500 ఎంపీ సీట్లు గెలిచేవాళ్లమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ సర్కారుకు ఏమాత్రం తేడాలేదని విమర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించడంపై సీఎం రేవంత్ మాట మార్చారని అన్నారు. ప్రజాపాలన దినోత్సవం కాదు.. విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులను మోసగించడమే కాంగ్రెస్ ప్రజాపాలన అని ఫైర్ అయ్యారు. టెర్రరిస్టులతో రాహుల్ గాంధీకి సంబంధాలున్నాయని అన్నారు. సిక్కులను ఊచకోత కోసింది రాహుల్ కుటుంబమేనని విమర్శించారు.