అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్    

  • గార్బేజ్ ఫ్రీ జోన్ గా కంటోన్మెంట్
  • బోర్డు అధికారుల​ స్పెషల్​ యాక్షన్ ​ప్లాన్ 
  • బోయిన్పల్లి సర్కిల్లో తొలి దశలో అమలు

కంటోన్మెంట్, వెలుగు:  కంటోన్మెంట్ ను గార్బేజ్​ఫ్రీ జోన్ గా మార్చేం దుకు బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.  చెత్తను రోడ్ల పై వేయడం, ఓపెన్​ ప్లేసుల్లో మూత్రం పోయడం చేసే వారికి భారీగా ఫైన్లు వేసేందుకు రెడీ అయ్యారు. తొలి దశలో బోర్డు పరిధిలోని సర్కిల్ 1, బోయిన్ పల్లి ప్రాంతాల్లో సోమవారం నుంచి అమలు చేస్తున్నారు. రోడ్ల పై చెత్త వేసే వారికి రూ. 5 వేలు ,  ఓపెన్​ ప్లేసుల్లో మూత్ర పోసే వారికి రూ. 500 ఫైన్ వేస్తామన్నారు.  గార్బేజ్ ఫ్రీ జోన్ గా మార్చేందుకు బోర్డు అధికారులు శానిటేషన్, హెల్త్ డిపార్ట్ మెంట్ తో కలిసి స్పెషల్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించి అమలు చేస్తున్నారు. సర్కిల్ 1, బోయిన్ పల్లి ప్రాంతంలోని ప్రతి ఇంటికి  పొడిచెత్త, తడిచెత్త వేసేందుకు రెండు డస్ట్ బిన్లు ఇవ్వను న్నారు. శానిటేషన్ వర్కర్సే ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఎవరైనా చెత్తను రోడ్లపై వేస్తే మా త్రం భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది.  దీనిపై ప్రజలకు ఇప్పటికే అవ గాహన కల్పించారు. కంటోన్మెంట్ బోర్డును గార్బేజ్ ఫ్రీ గా మార్చేం దుకు సహకరించాలని అధికారులు సూచించారు. త్వర లోనే బోర్డు   అన్ని సర్కిళ్లలో అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి 

చెరువుల కబ్జాలపై ఏం చేశారో రిపోర్ట్‌‌‌‌ ఇవ్వండి

పెట్రోల్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన

అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది