చైనాకు రాజ్నాథ్ వార్నింగ్ !

వాషింగ్టన్: దేశ రక్షణ విషయంలో అస్సలు వెనుకాడబోమని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియా జోలికొస్తే ఊరుకోబోమని పరోక్షంగా చైనాను హెచ్చరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. చైనాతో గల్వాన్ ఘర్షణలతో పాటు బోర్డర్ పహారాలో మన సైనికులు చూపిస్తున్న తెగువ, వారి సేవలను రాజ్ నాథ్ కొనియాడారు. 

'భారత సైనికులు ఏం చేశారు, మా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది బహిరంగంగా చెప్పలేను. కానీ మన జవాన్లు వారికి (చైనాకు) స్పష్టమైన సందేశం పంపారు. భారత్ జోలికొస్తే ఎవ్వరినీ వదలం, సహించమని మన సైనికులు మెసేజ్ పంపారు' అని రాజ్ నాథ్ చెప్పారు. బోర్డర్ అంశంతో పాటు ఇతర విషయాల పైనా ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా మునుపటి కంటే ఇప్పుడు భారత్ ఇమేజ్ బాగా మారిందన్నారు. దేశ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. వచ్చే కొన్నేళ్లలో వరల్డ్ టాప్ 3 ఎకానమీ దేశాల్లో ఒకటిగా ఇండియా ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

కీవ్ పరిసర ప్రాంతాల్లో రష్యా మారణహోమం

ఉచిత విద్యుత్ ప్రకటించిన పంజాబ్ సర్కార్