2 వేల నోట్లను పోస్టులో పంపితే.. అకౌంట్లో డబ్బు డిపాజిట్​

  • ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​

న్యూఢిల్లీ: ప్రజలు తమ వద్ద ఉండే రూ. 2 వేల నోట్లను పోస్టులో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ)కి పంపిస్తే, వారి బ్యాంకు అకౌంట్లలో ఆ మొత్తాన్ని జమ చేస్తామని గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. స్పెసిఫైడ్​ రీజినల్​ ఆఫీసులకు ఇన్సూర్డ్ ​ పోస్ట్​ ద్వారా రెండు వేల నోట్లను పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ అవకాశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయన పేర్కొన్నారు. 

ఎక్కడో దూరంగా ఉండే ఆర్​బీఐ  రీజినల్​ ఆఫీసులకు ప్రజలు ప్రయాణించాల్సిన అవసరం ఉండదని వివరించారు. ట్రిపుల్​ లాక్​ రిసెప్టకిల్​ (టీఎల్​ఆర్​)  ఫార్మ్​ ఆప్షన్​ కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు పద్ధతులూ చాలా సురక్షితమైనవేనని, అందుచేత భయపడాల్సిన అవసరం లేదని ఆర్​బీఐ రీజినల్​ డైరెక్టర్​ రోహిత్​ పీ దాస్​ వెల్లడించారు. ఒక్క ఢిల్లీ ఆఫీసులోనే ఇప్పటిదాకా 700 టీఎల్​ఆర్​ ఫార్మ్స్​ తమకు వచ్చినట్లు చెప్పారు.

 19 రీజినల్​ ఆఫీసులలో రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని అక్టోబర్​ 8 నుంచి ఆర్​బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రజల చేతిలో ఇంకా రూ. 10,000 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు మాత్రమే మిగిలాయని ఇటీవలే ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పిన విషయం తెలిసిందే.

ALSO READ : రెండు గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకోండి : మదన్ రెడ్డి