నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తనపై విధించిన బ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రెజ్లర్, ఒలంపిక్ బ్రోన్జ్ మెడల్ విన్నర్ బజరంగ్ పునియా. ఈ సస్పెన్షన్ తనపై ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్య అని, తాను బీజేపీలో చేరితే బ్యాన్ ఎత్తేస్తారని అన్నారు బజరంగ్.ఈ ఏడాది మార్చి 10న జరిగిన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్‌లో డోప్ పరీక్ష కోస శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పునియాను నాలుగేళ్ళ పాటు సస్పెండ్ చేసింది నాడా..
పునియాను నాడా మొదట ఏప్రిల్ 23న సస్పెండ్ చేయగా.. స్పోర్ట్స్ వరల్డ్ బాడీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా సస్పెన్షన్ విధించింది. అయితే, బజరంగ్ డోప్ పరీక్షకు నిరాకరించాడన్న వార్తలను ఖండించారు పునియా. నాడాకు శాంపిల్ ఇవ్వడానికి తాను నిరాకరించలేదని... డోప్ టెస్ట్ నిర్వహించడానికి నాడా టీం తన ఇంటికి వచ్చినప్పుడు, ఎక్స్పైర్ అయిన కిట్‌తో వచ్చారని.. ఇదే విషయాన్ని డిసెంబర్ 2023లోనే తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశానని స్పష్టం చేశారు బజరంగ్.
Also Read:-ఆస్ట్రేలియా నడ్డి విరిచిన టీమిండియా పేసర్లు.. బుమ్రా 1 జైస్వాల్ 2
NADA जब चाहे यहां चाहे मेरा डोपिंग टेस्ट ले सकती है वैध और मान्य किट के साथ। pic.twitter.com/hXC6nmKWsP
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) November 27, 2024
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై బిజెపి నాయకుడు, మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకే తనపై సస్పెన్షన్ విధించారని ఆరోపించారు బజరంగ్. బిజెపిలో చేరితే తనపై ఉన్న బ్యాన్ ఎత్తేస్తారని అన్నారు బజరంగ్