ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ని కేటాయించడంతో ఈ రోజు మ్యాచ్ కొనసాగనుంది. అయితే ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో జరుగుతుందా లేదా అనే అనుమానం అభిమానుల్లో కంగారు పెడుతుంది. కొలొంబోలో వాతావరణ సమాచార ప్రకారం నేడు 85 శాతం వర్ష సూచనలు ఉన్నాయని తెలుస్తుంది.
వర్షం పడితే పాక్ జట్టుకి భారీ టార్గెట్
శ్రీలంకలో ఈ మ్యాచ్ నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.. మ్యాచ్ సమయానికి వర్షం పడి ఆలస్యమైతే భారత్ బ్యాటింగ్ చేయడం సాధ్యపడదు. అదే జరిగితే పాకిస్తాన్ టార్గెట్ 24 ఓవర్లలో 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేసించనున్నారు. కనీసం 20 ఓవర్ల ఆట జరగాలి కాబట్టి ఒకవేళ 20 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే అప్పుడు పాక్ టార్గెట్ 181 పరుగులు అవుతుంది. మరి నేడైనా మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా ? లేకపోతే డక్ వర్త్ ప్రకారం టార్గెట్ సెట్ చేస్తారా చూడాలి.
ఇక ఈ మ్యాచ్ లో నిన్న టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 24.1ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేస్తుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56),గిల్ (58) అర్ధ సెంచరీలతో రాణించగా.. ప్రస్తుతం క్రీజ్ లో విరాట్ కోహ్లీ (8), రాహుల్ (17) ఉన్నారు.