పప్పు శనగలు అమ్మేదెట్ల?

పప్పు శనగలు అమ్మేదెట్ల?

గద్వాల జిల్లాలో దిగుబడి అంచనా 80 వేల క్వింటాళ్లు

గద్వాల, వెలుగు : ఆరుగాలం కష్టించి పంట పండించడం ఒక ఎత్తు అయితే.. దాన్ని మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు.  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలి.. లేదంటే బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముకోవాలి. కానీ, రెండోచోట్లా అవకాశం లేకుంటే..?  గద్వాల జిల్లా పప్పుశనగ రైతులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  తాముపండించిన పంటను అమ్ముకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. 25 క్వింటాళ్లకు మించి తేవొద్దని రైతులకు  పరిమితి పెట్టింది.  పోనీ బయట విక్రయిద్దామంటే గిట్టుబాటు ధర లేదు.  దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

గద్వాల జిల్లాలో15వేల ఎకరాల్లో సాగు

గద్వాల జిల్లాలోని అలంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, అయిజ, రాజోలి, వడ్డేపల్లి, గద్వాల, మల్దకల్ మండలాల్లో దాదాపు 4,500 మంది రైతులు 15 వేల ఎకరాలకు పైగా పప్పు శనగ పంట సాగు చేశారు.  70 వేల నుంచి 80 వేల క్వింటాళ్ల పప్పు శనగలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  రూ. 5,335 మద్దతు ధర ప్రకటించి.. పంటను కొనుగోలు చేస్తామని ప్రకటించింది.  కానీ,  ఒక్కో రైతు ఎకరాకు 5 క్వింటాళ్లు, 5 ఎకరాల వరకే తేవాలని కండీషన్ పెట్టింది.   

7 సెంటర్లు.. 18వేల క్వింటాళ్లు

జిల్లాలో ఏడు పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 18 వేల క్వింటాళ్లు మాత్రమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టింది.  ఇప్పటికే అన్ని ఓపెన్ సెంటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా..  7 వేల క్వింటాళ్ల కొనుగోలు కూడా పూర్తయ్యింది.  మరో 11 వేల క్వింటాళ్లు కొంటే తమ టార్గెట్ కంప్లీట్ అవుతుందని అధికారులు చెబుతుండడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు.  ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, అధికారులు చెప్పునట్లు 5 క్వింటాళ్లు వేసుకున్నా 15 వేల ఎకరాలకు 75 వేల క్వింటాళ్లు అవుతాయని అంటున్నారు.  మరి 18 వేల క్వింటాళ్లే కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు.  బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.4 వేలకు మించి ధర లేదని, ఇలా అయితే పూర్తిగా నష్టపోతామని వాపోతున్నారు. 

కౌలు రైతుకు నష్టాలే

సొంత పొలం ఉన్న రైతులకే దాదాపు రూ. 20 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది.  కౌలు రైతులు మరో రూ.15 వేలు అదనంగా పెట్టారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ. 5,335కు పంటను పూర్తిస్థాయిలో  కొంటే సొంత పొలం రైతులకు ఎకరాకు రూ.10 వేలు కూడా మిగిలే పరిస్థితి లేదు.  కౌలు రైతులైతే రూ.5 వేలు లాస్.  బయట రూ. 4 వేలకు క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మితే పెట్టుబడి కూడా వచ్చేలా లేదని,  ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పంట కొనాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  అంతేకాదు అన్ని మండలాల్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఉండవెల్లి మండలంలో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని రైతులు ధర్నాకు దిగారు.  

25 క్వింటాళ్లే కొంటరంట

నాకు 5 ఎకరాల సొంత పొలం ఉన్నది. అందులో పప్పు శనగలు సాగు చేశాను.  40 క్వింటాళ్ల దిగుబడి వస్తే కొనుగోలు కేంద్రానికి తీసుకపోయిన. కానీ సారోళ్లు 25 క్వింటాళ్లు కొంటామని చెబుతున్నరు.  మిగతా 15 క్వింటాళ్ల ఎక్కడ అమ్ముకోవాలి.

–మద్దిలేటి,  రైతు మానవపాడు

టార్గెట్ ఉన్నమాట వాస్తవమే

ప్రస్తుతం ఏడు కొనుగోలు కేంద్రాలలో 18వేల క్వింటాళ్ల పప్పు శనగలు కొనాలని టార్గెట్ ఉన్నమాట వాస్తవమే. కానీ, మరో 50 వేల క్వింటాళ్ల పప్పు శనగల కొనుగోలు చేసేలా టార్గెట్ పెంచాలని ప్రభుత్వానికి, జిల్లా ఆఫీసర్లకు లెటర్ రాసినం.  మంత్రులు,  ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం చెప్పినం. పై నుంచి ఆదేశాలు రాగానే పూర్తిస్థాయిలో కొంటం.

 –భాస్కర్ రెడ్డి,  మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెడ్ డీఎం,  గద్వాల