గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ రామగుండం టికెట్ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్‌కు ఇవ్వాలని, లేకపోతే సింగరేణి వ్యాప్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐఎన్‌టీయూసీ పక్షాన కాంగ్రెస్‌కు సహకరించబోమని తీర్మానం చేశారు. ఆదివారం గోదావరిఖనిలోని సింగరేణి వ్యాప్తంగా డివిజన్ల తరలివచ్చిన ఐఎన్‌టీయూసీ ప్రతినిధులతో వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్లీడర్లు మాట్లాడుతూ ఐఎన్‌టీయూసీ పక్షాన రామగుండం టికెట్మాత్రమే కోరుతున్నామని, ఒకవేళ జనక్ ప్రసాద్‌కు ఇవ్వకపోతే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోమని తీర్మానించినట్లు చెప్పారు. మీటింగ్‌లో లీడర్లు బాబర్ సలీంపాష, ఆర్‌డీ చంద్రశేఖర్, కె.సదానందం, ఎస్.నర్సింహరెడ్డి, కుమారస్వామి, పి.ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య పాల్గొన్నారు.