కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వడ్లు కొనకపోతే.. ఇంకెవరూ కొనరు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వడ్లు కొనకపోతే.. ఇంకెవరూ కొనరు

నర్సింహులపేట, వెలుగు : సీఎం కేసీఆర్ వడ్లు కొనకపోతే రూ. 1500 కూడా ఎవరూ కొనరని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని బాసుతండా, బక్క తండా, జయపురం గ్రామాల్లో మంగళవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో తనకు ఓటు వేస్తే కేసీఆర్ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ దొరకక పక్క జిల్లా నుంచి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మెరుగు శంకర్, నాయకులు తోట సురేశ్‌‌‌‌‌‌‌‌, సర్పంచులు మందుల యాకన్న, సురేశ్‌‌‌‌‌‌‌‌ మంక్తి, ఎంపీటీసీ నేలకుర్తి మంజుల పాల్గొన్నారు.