సభలో మజ్లిస్ అరాచకాలు ప్రజలకు వివరించాలి
బీజేపీ నేత బండి సంజయ్ సవాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా హిందువైతే….పాతబస్తీలో బహిరంగ సభ పెట్టి దేశద్రోహ పార్టీ మజ్లిస్ అరాచకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ నేత బండి సంజయ్ సవాల్ విసిరారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ కుర్మగూడలో నిర్వహించిన ప్రచారంలో సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తన స్వార్థం చేసుకోవడం కోసం యాగాలు చేసి.. షాయ వస్ర్తాలు ధరిస్తే.. నిన్ను ప్రజలు గుర్తించరు.. దేశద్రోహ పార్టీ, హిందూ దేవుళ్లను దూషించే పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నీవు ఎలాంటి హిందువో సమాజం అర్ధం చేసుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. భాగ్యనగర్ నిరుద్యోగులను నట్టేట ముంచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులాలు, వర్గాలకు అతీతంగా ఒక్కటై ఓటుతో బుద్ది చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
మతకల్లోలాలకు కుట్రల చేస్తున్నారని సమాచారం ఉంటే ఎందుకు అరెస్టు చేయరు
హైదరాబాద్ లో మత కల్లోలాలు రగిల్చేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్న సీఎం కేసీఆర్, డీజీపీల దగ్గర పక్కా సమాచారముంటే ఎందుకు అరెస్టు చేయడం లేదో స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే సాక్షాత్తుగా భయాందోళనలు సృష్టించి ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనకుండా కుట్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రజలెవరూ భయపడొద్దు… తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనండి. బీజేపీ అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని బండి సంజయ్ కోరారు.
మేనిఫెస్టో హామీలు రిపీట్
కుర్మగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రజలకు వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి ఒక్కరికీ ‘ఉచితంగా కరోనా వ్యాక్సిన్’ పంపిణీ చేస్తామని.. అర్హులైన పేదలందరికీ ‘డబుల్ బెడ్రూం’ ఇండ్లను నిర్మించి అందజేస్తాం.. అర్హులైన ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదు. బీజేపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలోని జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామని.. హెల్త్ కార్డ్స్ ను రెన్యువల్ చేయడంతోపాటు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కచ్చితంగా ఉచిత ట్రీట్ మెంట్ జరిగేలా చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరోనా వారియర్స్ గా అహర్నిశలు కృషి చేస్తున్న కార్మికులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామని.. అలాగే గ్రేటర్ పరిధిలో సొంత ఆటో నడిపే వారికి ఇన్సూరెన్స్, రిపేర్లు, ఫిట్ నెస్ అవసరాల కోసం ఏటా రూ. 7 వేల ఆర్దిక సాయం అందజేయడంతోపాటు ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకం వర్తింపజేస్తామని చెప్పారు.
Read More News….