కరీంనగర్ క్రైమ్, వెలుగు: సౌండ్ పొల్యూషన్‌కు కారణమయ్యే సైలెన్సర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. గురువారం కమిషనరేట్ఆవరణలో సౌండ్ఎక్కువ వచ్చే సైలెన్సర్లు బిగించుకున్న వాహనదారులు, మెకానిక్‌లు, డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడినవారికి కౌన్సెలింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎక్కువ సౌండ్వచ్చే సైలెన్సర్లను వాహనాలకు బిగించే మెకానిక్‌లపై కేసులు పెడతామని హెచ్చరించారు.
అనంతరం ఎక్కువ సౌండ్వచ్చే సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాసు, ఎం.భీంరావు, ఏసీపీలు బి.విజయ్ కుమార్, సి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారుమహిళల రక్షణలో షీటీంలు కీలకం మహిళలు, విద్యార్థినుల రక్షణలో షీటీంలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. షీటీంలో పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు సీపీ నగదు రివార్డులను అందజేసి సత్కరించారు.