బకాయిలు కట్టకపోతే కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తం… కేసులు పెడుతం

పాత బకాయిల వసూలుకు విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ప్రత్యేక చర్యలు

ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు వసూలు

ఉమ్మడి జిల్లాలో రూ.46.30 కోట్లు టార్గెట్​

డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీల పేరిట గృహ వినియోగదారులపై కేసులు

ఇప్పటికే 71,179 కేసులు, రూ.22.08 కోట్ల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బకాయిలు కట్టకుంటే కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామంటూ బెదిరింపు

నల్గొండ, వెలుగు: కరోనా కాలంలో ఎదురవుతున్న ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు విద్యుత్ శాఖ కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటోంది. కరెంట్ వాడకానికి సంబంధించి ఏ ఒక్క చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొరికినా వదిలిపెట్టడం లేదు. ప్రధానంగా పాత బకాయిలపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది. ఉచిత విద్యుత్ కింద లబ్ధి పొందుతున్న రైతులు, గృహ వినియోగదారులను విద్యుత్ శాఖ టార్గెట్​ చేసింది. కోవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో విద్యుత్ బిల్లును ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో కట్టే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చామని చెబుతున్న సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ మేరకు వివిధ రూపాల్లో భారం మోపేందుకు ప్లాన్ చేసింది. కస్టమర్ చార్జీలు, డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్ల పేరుతో వసూళ్లకు తెరతీసింది.

రూ.30 కూడా వదిలిపెట్టకుండా…

వ్యవసాయానికి ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరా చేస్తున్నందున రైతుల నుంచి కస్టమర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఈ చార్జీలు కట్టకుండా మొండికేసిన రైతుల నుంచి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. పంటలు కోతకొచ్చిన టైం కాబట్టి రైతుల చేతుల్లో పైసలు ఉంటాయని భావించిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ పాత బకాయిల వసూలుకు గురిపెట్టింది. ఉమ్మడి నల్గొండలో జిల్లాలో 4,25,826 వరకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కనెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీల రూపంలో రైతులు రూ. 30 చొప్పున చెల్లించాలి. గతంలో వీటిపై అంతగా దృష్టి పెట్టని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ఇప్పుడు వాటిని ముక్కు పిండి వసూలు చేసే పనిలో పడ్డారు. కస్టమర్ చార్జీల బకాయిలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 46.30 కోట్లు ఉన్నాయి. అన్ని కేటగిరిల్లో కలిపి బకాయిలు మొత్తం రూ.139 కోట్లు కాగా, ఇందులో మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కస్టమర్ చార్జీలే ఉన్నాయి.

డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో కేసులు

డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీల పేరిట గృహ వినియోగదారులపైన కేసులు పెడుతున్నారు. ఇండ్లలో కరెంట్ వాడకం పెరిగిందన్న కారణంతో ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించి డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇండ్లకు మీటర్లు బిగించేటప్పుడే కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం ఏ మేరకు ఉంటుందనేది అంచనా వేస్తారు. దాని ప్రకారం ధర నిర్ణయించి డిపాజిట్లు తీసుకుంటారు. కానీ మీటర్ శాంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పుడు చేతులు తడిపితేనే పనిచేసిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, ఇప్పుడు మళ్లీ కొత్తగా కేసులు పెడుతుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలో ఏసీలు, ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వాడుతున్నందున విద్యుత్ లోడ్ పెంచాల్సిన అవసరం వచ్చిందని చెప్పి డిపాజిట్లు సేకరిస్తున్నారు. ఇంటికి వచ్చే విద్యుత్​బిల్లులోనే డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహవినియోగదారులపై ఇప్పటివరకు 71,179 కేసులు నమోదు చేసి, మొత్తం రూ. 22.08 కోట్ల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించారు. ఇందులో 54,553 మంది నుంచి రూ.17.47 కోట్లు వసూలు చేశారు. ఇంకా 16,626 కేసులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తిస్థాయిలో రాబట్టేందుకు విద్యుత్​ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. వినియోగదారులకు ఫోన్ చేసి డిపాజిట్లు కట్టమని చెప్తున్నారు. లేదంటే పవర్ కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో మరో గత్యంతరం లేక డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

For More News..

జీహెచ్ఎంసీలో ప్రచారం కోసం లీడర్ల చలో హైదరబాద్​

ఏసీబీ దాడులు జరుగుతున్నా మారని పోలీసులు