కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. దానికి సరైన కేర్ తీసుకోకపోతే క్రాడిల్ క్యాప్‌‌ అంటే తలపైన చుండ్రులాగా తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు పేరుకుపోవడం. డైపర్‌‌‌‌ ర్యాషెస్‌‌, మిలియా అంటే నీటి బుడగల్లాగ కురుపులు, మొటిమల్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. తల్లులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఇలాంటి వాటి బారినపడే ప్రమాదం తప్పుతుంది. అందుకు ఏం చేయాలంటే..

పిల్లలు పుట్టాక వారం రోజుల వరకు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లి కడుపులో నుంచి పిల్లలు వచ్చాక బయటి వాతావరణానికి సర్దుకోవడానికి కొంత టైం పడుతుంది. రోజూ స్నానం చేయిస్తే పిల్లల చర్మం డ్రైగా, రఫ్‌‌గా మారుతుంది. అందుకే వారం తరువాత రోజుకు ఒకసారి స్నానం చేయిస్తే సరిపోతుంది.పెద్ద వాళ్లలా కాకుండా పిల్లల చర్మం తొందరగా తేమను కోల్పోతుంది. దాంతో చర్మం పొడిబారుతుంది. అందుకే డాక్టర్ సలహా తీసుకొని వాళ్ల చర్మానికి తగ్గ మాయిశ్చరైజర్‌‌ రాయాలి. 

స్నానం చేయించిన వెంటనే మాయిశ్చరైజర్‌‌‌‌ రాస్తే మంచిది. సబ్బులు, షాంపూలు కూడా ఎక్స్‌‌పర్ట్‌‌ సలహాతోనే వాడాలి. లేదంటే వాటి వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి.రోజూ మసాజ్ చేయడం వల్ల పిల్లల చర్మం మృదువుగా ఉంటుంది. ఎక్స్‌‌పర్ట్‌‌ సలహాతో చర్మానికి సరిపోయే మసాజ్‌‌ ఆయిల్‌‌, లోషన్‌‌ వాడాలి. పిల్లల చర్మాన్ని సున్నితంగా మసాజ్‌‌ చేయాలి.పిల్లల కోసం మార్కెట్‌‌లో దొరుకుతున్న ప్రొడక్ట్స్ అన్నీ మంచివి కావు. వాటికి మంచి రంగు, వాసన రావడానికి కెమికల్స్‌‌ కలుపుతుంటారు. వాటి వల్ల పిల్లల చర్మం తొందరగా పాడవుతుంది. అందుకే పుట్టిన కొన్ని నెలల వరకు ఎలాంటి ప్రొడక్ట్స్‌‌ వాడకపోవడం మంచిది. పిల్లల్ని పగటిపూట బయటికి తీసుకెళ్తే ఎండ తగలకుండా క్యాప్‌‌, టవల్‌‌, గొడుగుతో కవర్‌‌‌‌ చేయాలి.

 

ఇవి కూడా చదవండి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ దందా

స్లోగా సూర్యాపేట అభివృద్ధి పనులు

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..