ముంబై : దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 నుంచి మహారాష్ట్రలో స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. తాజాగా కేసులు పెరుగుతుండటంతో ఆఫ్ లైన్ క్లాసులు కొనసాగించే అంశంపై ప్రభుత్వం స్పందించింది. ఒమిక్రాన్ కేసులు పెరిగితే బడులను తిరిగి మూసివేయడంపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వర్ష ఏక్ నాథ్ గైక్వాడ్ తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి కేసుల తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రైమరీ తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉందని, అది క్రమంగా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ స్కూళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా గతంలో మాదిరిగా ఆన్ లైన్ క్లాసులు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటి వరకు 213 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. ఒక్క మహారాష్ట్రలోనే 54 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
For more news