
Traffic e-Challan: దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వ్యక్తులకు అధికారులు ఫైన్స్ విధిస్తుంటారని మనకు తెలుసు. ఈ క్రమంలో హెల్మెట్ ధరించకపోయినా, లైసెన్సు లేకున్నా లేదా మరే ఇతర ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అధికారులకు దొరికినప్పుడు వారిపై ఇ-చలాన్లు విధించటం సర్వసాధారణం. అయితే వీటిని ప్రజలు చాలా లైట్ తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. చాలా రాష్ట్రాల్లో దాదాపు 40 శాతం చలాన్లకు మాత్రమే వసూళ్లు జరుగుతున్నట్లు తేలింది.
వాహనదారులు చలాన్ల చెల్లింపులో నిర్లక్ష్యాన్ని తగ్గించేందుకు కొత్త రూల్స్ వాహన చట్టంలో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి కింద మూడు నెలల కంటే ఎక్కువ కాలం నుంచి చెల్లించకుండా ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ మూడు సార్లు దొరికినా లేక ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే కూడా వారి లైసెన్సును రద్దు చేసే ప్రణాళికలను తీసుకొస్తున్నారు. అలాగే ట్రాఫిక్ చలాన్లను వ్యక్తి వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంకి కూడా లింక్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ALSO READ | హైదరాబాద్ ORRపై టోల్ ఛార్జీల పెంపు.. కిలో మీటర్కు ఎంత పెరిగిందంటే..
గత ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించని ట్రాఫిక్ చలాన్లు ఉన్న వ్యక్తులు లేదా డ్రైవర్ల నుంచి అధిక ఇన్సూరెన్స్ ప్రీమియం వసూలు చేయాలనే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయటం ద్వారా వ్యక్తులు సకాలంలో తమ పెండింగ్ చలాన్లను చెల్లించేలా చేయాలని చూస్తోంది. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టంలో చూపిన ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పద్ధతులు ఎంత సమర్థవంతంగా అమలు చేయబడుతున్నాయో తెలపాలని సుప్రీం కోర్టు ఇటీవల దేశంలోని 23 రాష్ట్రాలతో పాటు ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది.
వసూళ్ల గణాంకాలను పరిశీలిస్తే మెుత్తం ఇష్యూ చేసిన చలాన్లలో సగటున 40 శాతం మాత్రమే వసూలు అవుతున్నట్లు తేలింది. ముందుగా దేశ రాజధాని దిల్లీలో అత్యల్పంగా 14 శాతం రికవరీ రేటు ఉండగా దీని తర్వాత కర్ణాటకలో 21 శాతం, తమిళనాడు-యూపీలో 27 శాతం రికవరీ ఉన్నట్లు తేలింది. అలాగే మహారాష్ట్ర హర్యాణాలో అత్యధికంగా 62 నుంచి 76 శాతం చెలాన్ల రికరవీ రేటు ఉన్నట్లు వెల్లడైంది. అంటే త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కూడా చలాన్ల రికవరీ డ్రైవ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం డిస్కౌంట్లు ప్రకటించే వరకు ఆగకుండా ముందుగానే తమ వాహనాలపై పెండింగ్ చెలాన్లను క్లియర్ చేసుకోవటం ఉత్తమం.
ట్రాఫిన్ రూల్స్ పాటించనందుకు హైదరాబాదులో కొత్త పెనాల్టీలు ఇవే..
- మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష
- హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.వెయ్యి జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష
- సీట్ బెల్టు ధరించకుండా డ్రైవింగ్ చేస్తే రూ.వెయ్యి జరిమానా
- డ్రైవింగ్ సమయంలో మెుబైల్ ఫోన్ వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా
- వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5 వేలు జరిమానా
- ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.వెయ్యి జరిమానా
- సరైన ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2-4వేలు జరిమానా
- పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష
- ప్రమాదకరంగా ర్యా్ష్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు జరిమానా
- ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు జరిమానా
- ఓవర్ స్పీడ్ గా వాహనాలను నడిపితే రూ.5 వేలు జరిమానా
- మైనర్లు ట్రాఫిల్స్ రూల్ పాటించకుంటే రూ.25 వేలు జరిమానా
- సిగ్నల్ జంప్ చేస్తే రూ.5 వేలు జరిమానా