ముంబై: బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలు హింసాత్మక దాడులు ఎదుర్కొంటున్నారని, దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆందోళన వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఫోన్ కాల్‌తో రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ అల్లర్లను మాత్రం కట్టడి చేయలేరా? అని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన షేక్ హసీనా ఇక్కడ సేఫ్‌గానే ఉన్నారు కానీ, ఆ దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు.