గుంపులుగా తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి

  • ఫంక్షన్ల మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టాలి
  • కరోనా కట్టడి చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు 

హనుమకొండ జిల్లా: ‘‘జనం గుంపులు గుంపులుగా గుమిగూడకుండా.. గుంపులుగా తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. అలాగే ఫంక్షన్ల మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టాలి.. ప్రైవేట్ హాస్పిటల్స్ పీడించకుండా చర్యలు తీసుకోవాలి..’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కరోనా కట్టడి, ఆసుపత్రుల్లో ఏర్పాట్లు, వడగండ్ల వర్షాల వల్ల పంట నష్టాలు, జ్వర సర్వే, దళిత బంధు పథకం అమలు తదితర అంశాల పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, 
రెండు జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, సీపీ తరుణ్ జోషి, వైద్యాధికారులు, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ లలో హనుమకొండ జిల్లాలో ఎక్కువ అయ్యింది.. వరంగల్ లో తక్కువ అయిందన్నారు. రాష్ట్రంలో ఇదివరకు కరోనను బాగా కంట్రోల్ చేశారని కేంద్రం కూడా ఒప్పుకుందన్నారు. ఇప్పుడు ఇంటింటి సర్వే నడుస్తోందని వివరించారు. పోయిన సారి కొన్ని హాస్పిటల్స్ పీడించినయ్.. కొన్ని బాగా సేవలు అందించాయని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఇప్పుడు  ప్రైవేట్ హాస్పిటల్స్ పీడించకుండా యాక్షన్ తీసుకోవాలన్నారు. పంట నష్టం మీద వెంటనే నివేదికలు ఇవ్వాలని, ఫిబ్రవరి లోపలే దళిత బంధు గ్రౌండింగ్ కంప్లీట్ కావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక

దేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు ముఖేష్ అంబానీది

కోహ్లీ గొప్ప క్రికెటర్..బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు