తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భట్టి విక్రమార్క.  ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతోన్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే  అనుమతివ్వలేదన్నారు.  చంచల్ గూడ జైలులో ఉన్న పార్టీ నాయకులను కలువడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రభుత్వం పరాకాష్టకు నిదర్శనమన్నారు. ‘గౌరవ పార్లమెంటు సభ్యుడు వచ్చి విద్యార్థులను కలుస్తానంటే.. వద్దని చెప్పడం అక్కడ ఏదో తప్పిదాలు జరుగుతున్నాయి.. ఉస్మానియా యూనివర్సిటీని అణగదొక్కుతున్నారు.. అక్కడకు వస్తే విద్యార్థులు అన్ని విషయాలు మాట్లాడితే.. అన్నీ బయటకు వస్తాయనే భయం పట్టుకున్నట్లుంది..’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

‘రాహుల్ గాంధీ చిన్న వ్యక్తి ఏమీ కాదు.. కదా.. జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసిన వ్యక్తి.. అంతే కాదు ఎంపీ కూడా.. ఆయన జాతీయ నాయకుడు కాబట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటారు... ఇక్కడకు అలాగే వస్తున్నారు.. రాహుల్ గాంధీ ఓయూ సందర్శనకు అనుమతివ్వకపోతే ఏం చేయాలో పార్టీ నేతలంతా చర్చించి నిర్ణయం తీసుకుంటాం..’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు

టీఎంసీ పాలనకి ఏడాది పూర్తి.. మరుసటి రోజే మర్డర్స్