ఘటన జరిగిన రోజే సాంపిల్స్ తీసుకుంటే రిజల్ట్ కరెక్ట్‌గా వచ్చేది : ప్రీతి తండ్రి

ముందు నుంచీ చెబుతున్నట్టుగానే ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్యేనని మెడికో స్టూడెంట్ ప్రీతి తండ్రి నరేందర్ మరోసారి ఆరోపించారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదని వెల్లడించారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి కోరడానికి వచ్చామని నరేందర్ తెలిపారు.  నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నామన్న ఆయన.. ఇటీవల మట్టేవాడా పోలీసులు తమ ఇంటికి వచ్చి... ఘటనపై మరో సారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని చెప్పారు. టాక్సికాలజీ కోసం ఫ్రెష్ గా ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టి సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఘటన జరిగిన రోజే నమూనాలు తీసుకొని ఉంటే టాక్సీ కాలజీ  రిజల్ట్ కరెక్ట్ గా వచ్చేదని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.