దుబ్బాకలో సుజాత గెలిస్తే.. హరీశ్‌దే పెత్తనం

దుబ్బాకలో సుజాత గెలిస్తే.. హరీశ్‌దే పెత్తనం

ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి
మాజీ మంత్రి, బీజేపీ లీడర్ బాబు మోహన్

దుబ్బాక, వెలుగు: దుబ్బాకలో టీఆర్ఎస్ క్యాండిడేట్ సోలిపేట సుజాత గెలిస్తే మంత్రి హరీశ్ రావే పెత్తనం చేస్తాడని మాజీ మంత్రి, బీజేపీ లీడర్ బాబు మోహన్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆమెను ప్రగతిభవన్ ముఖం కూడా చూడనివ్వరన్నారు. ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావుతో కలిసి ఆయన శుక్రవారం దుబ్బాక టౌన్ లో ప్రచారం చేశారు. దుబ్బాక అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని బాబుమోహన్ మండిపడ్డారు. ఆ ప్రాంత ప్రజల బాగోగులను సీఎం ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. దుబ్బాక సెగ్మెంట్ గజ్వేల్, సిద్దిపేటల పక్కనే ఉన్నా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఏండ్లుగా దుబ్బాకలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సిద్దిపేట బస్టాండ్ అన్ని హంగులతో అద్భుతంగా ఉంటే, దుబ్బాక బస్టాండ్ లోకి వెళ్లేందుకే జనం భయపడే పరిస్థితి ఉందన్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చినవా?

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి పరుపరుగున వచ్చిన హరీశ్ రావు.. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని బాబు మోహన్ డిమాండ్ చేశారు. తాను ఆందోల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీజీ కాలేజీని తీసుకొస్తే, తన పదవి అయిపోగానే ఆ కాలేజీని హరీశ్ రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని మండిపడ్డారు. రఘునందన్ గెలిస్తే దుబ్బాక అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు.

For More News..

బోర్డుల కంట్రోల్‌‌లోకి ప్రాజెక్టులు!

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు