పంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి

సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో  ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి  పాల్గొన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజను కేంద్రమే కొనాలన్నారు జగదీష్ రెడ్డి. లేకుంటే తెలంగాణ ఉద్యమంలాగే రైతు ఉద్యమం చేపడాతామన్నారు. 
రైతులకు అండగా నిలవాల్సిన కేంద్రం బాధ్యతల నుండి తప్పుకుంటుందన్నారు. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవని, పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. వరి వేయొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకులు రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించి మోసం చేశారని విమర్శించారు. మరో తెలంగాణా ఉద్యమంలా రైతు ధర్నా చేపట్టామన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

స్వాతంత్ర పోరాటంపై ఢిల్లీలో ఎగ్జిబిషన్

మౌనంగా ఉండొద్దు..ఏవిధంగా సాయం చేయగలరో చేయండి

డ్రగ్స్ విషయంలో పోలీసుల తీరు సరికాదు

రూటు మార్చిన రష్యా.. దక్షిణ ప్రాంతాల్లో దాడులు

బెయిల్ రద్దు చేయాలని సిట్ చెప్పినా ఎందుకు చేయలే?